ఎండాకాలం వచ్చేసినట్టే పగలు ఎండలు మొదలయ్యాయి. ఇంకా రాత్రిపూటకొద్దిగా చల్లటి వాతావరణం ఉన్నా.. ఉక్కపోత కూడా ఉంటుంది. చాలా ప్రదేశాల్లో ఎండాకాలంలో పవర్ కట్ ఉంటుంది. అందుకే అపార్ట్ మెంట్లు.. కార్యాలయాలు.. పెద్ద పెద్ద ఇళ్లలో కూడా జనరేటర్ పెట్టుకుంటారు. వాస్తు పండితులు తెలిపిన వివరాలు జనరేటర్ ఇంట్లో ఎక్కడ ఉండాలి. అలాగే ఇంటి రెండు వైపులా రోడ్లు ఉంటే నష్టాలొస్తాయా.. ఈ విషయాల్లో వాస్తు సిద్దాంతుల సూచనలు ఏమిటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . !
ప్రశ్న: చాలావరకు అపార్ట్మెంట్లలో జెనరేటర్లు ఉంటాయి. అయితే వాటికి కూడా వాస్తు ఉంటుందా? ఎందుకంటే సోలార్ ప్యానెళ్లకు కూడా వాస్తు ఉంటుందనికొంతమంది చెబుతున్నారు. . ఒకవేళ వాస్తు వర్తిస్తే... జెనరేటర్ అనేది సెల్లార్లో ఎక్కడ ఉంటే మంచిది?
జవాబు: అవును సోలార్ ప్యానెళ్లకు ఉన్నట్టే... జెనరేటర్లకు కూడా వాస్తు వర్తిస్తుంది. అపార్ట్మెంట్ లేదా ఇండిపెండెంట్ ఇళ్లల్లో జెనరేటర్లను ఆగ్నేయం లేదా వాయువ్యం మూలల్లో పెట్టుకోవాలి. అప్పుడే ఆ ఫ్లాట్స్ లో ఉండే వాళ్లు ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా క్షేమంగా ఉంటారు.
ప్రశ్న: ఇల్లు లేదా స్థలానికి ఎన్ని రోడ్లు ఉంటే మంచి జరుగుతుంది? మా ఇంటికి, అలాగే నా కూతురి కొత్తింటికి రెండు రోడ్లు ఉన్నాయి. అలా ఉండటం మంచిదేనా? ఉంటే ఏ దిక్కులకు ఉండాలి? అంతేకాకుండా ఏ రెండు దిక్కులకు ఉంటే వాస్తు దోషాలు ఉంటాయో చెప్పండి.
జవాబు: రెండు రోడ్లు ఉన్న ఇంటికి అంతా మంచే జరుగుతుంది. ఆ విషయంలో భయపడాల్సిన పని లేదు. ముఖ్యంగా ఉత్తరం, తూర్పు దిక్కులకు రోడ్లు ఉంటే పరపతి, పేరు అధికంగా లభించే అవకాశాలు ఉంటాయి. అలాగే దక్షిణం, పడమర దిక్కులకు ఉంటే ఆర్థిక స్తోమత పెరిగి అధికారం కూడా లభిస్తుంది. అలాకాకుండా ఉత్తరం, పడమర దిక్కులకు రోడ్లు ఉంటే... ఆ ఇంటి పరిస్థితులు కాస్తంత గాలివాటంగా ఉంటాయి. ఈ మూడింటితో పెద్ద ప్రమాదాలు ఏమీ ఉండవు. కానీ దక్షిణం, తూర్పు దిక్కులకు మాత్రం ఉండకూడదు. అలా ఉన్నప్పుడు వాళ్లకు ఏ విధంగానూ కలసిరాదు.
